హెచ్ 1బీ వీసాల జారీని… రెట్టింపు చేయండి

అగ్రరాజ్యం అమెరికాలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత నానాటికీ తీవ్ర మవుతోందని అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రొఫెషనల్ వర్క్ఫోర్స్ అవసరం భారీగా పెరుగుతోందని గుర్తు చేసింది. కొరతను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వానికి, కాంగ్రెస్‍కు (పార్లమెంట్) విజ్ఞప్తి చేసింది. విదేశీ నిపుణులను రప్పించడానికి వీలుగా హెచ్ 1బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించింది.
గ్రీన్‍కార్డుల జారీ విషయంలో అమల్లో ఉన్న దేశాల వారీ కోటా వ్వవస్థను ఎత్తివేయాలని పేర్కొంది. తగినంత మంది వృత్తి నిపుణులు అందుబాటులో లేకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుజానే క్లార్క్ చెప్పారు. ఈ పరిణామం నూతన ఉద్యోగాల సృష్టికి అడ్డంకిగా మారుతుందని అన్నారు. ఎంప్లాయిమెంట్ ఆధారిత వీసాలను ప్రతిఏటా కేవలం 1,40,00 మాత్రమే ఇస్తున్నారని వీటికి 2,80,000 పెంచాలని విజ్ఞప్తి చేశారు.