Netanyahu: అమెరికా చేసిందే మేమూ చేశాం : నెతన్యాహూ

హమాస్ కీలక నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహా పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని పలు దేశాలు ఖండిరచాయి. అయితే, ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Netanyahu) సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హమాస్ (Hamas) తో యుద్ధానికి దారితీసిన అక్టోబరు 7 నాటి దాడులను ఆయన ప్రస్తావించారు. వీటిని అమెరికా (America) లో జరిగిన 9/11 దాడులతో పోల్చుతూ, నాడు యూఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామన్నారు. 9/11 దాడుల తర్వాత వాటికి కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా చెప్పింది. దీనిపై ఐక్యరాజ్యసమితి లో తీర్మానం కూడా చేసింది. ఇప్పుడు మేము అదే చేశాం అని నెతన్యాహూ పేర్కొన్నారు.