Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మాట వినని ఈయూ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్స్‌తో ప్రపంచదేశాలు విసిగిపోయాయి. ప్రపంచంలోనే పలు ప్రధానదేశాలపై ఆయన సుంకాలు విధించారు. అన్ని దేశాల కన్న ఎక్కువగా భారత్ (India) పై 50 శాతం సుంకాలు విధించారు. దీనికి రష్యా (Russia) నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ (Ukraine) యుద్ధానికి సహకరిస్తున్నారనే సాకు చెబుతున్నారు. ఇదేకాకుండా, భారత్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇతర యూరప్ దేశాలను తమలాగే భారత్‌పై సుంకాలు విధించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే, ట్రంప్ మాటల్ని ఇతర దేశాలు పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్, చైనాలపై ఈయూ సుంకాలు విధించే అవకాశం చాలా తక్కువగా ఈయూ (EU) వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్, చైనాలు ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని, రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ రెండు దేశాలపై ఈయూ 100 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ ఈయూను కోరారు. దీనికి ఈయూ అధికారులు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.