Minister Uttam: తమ్మిడిహట్టి ఎత్తుపై మహారాష్ట్రతో సంప్రదిస్తున్నాం : మంత్రి ఉత్తమ్
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పునరుద్ఘాటించారు. నీటిపారుదలశాఖ అధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామన్నామని తెలిపారు. తమ్మిడిహట్టి(Tammidihati) నుంచి సుందిళ్లకు నీళ్తు తరలిస్తే ప్రాజెక్టు వ్యయం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అన్నారు. భూసేకరణ కూడా సగానికి తగ్గుతుందన్నారు. గత ప్రణాళికతతో పోలిస్తే రూ.1500 కోట్లు నుంచి రూ.1600 కోట్లు తగ్గుతుంది. సాంకేతిక పరిశీలన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం.అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని అధికారులు డీపీఆర్(DPR) సిద్ధం చేయాలి. సర్వే, డీపీఆర్ అయ్యాక కేబినెట్ ముందు ప్రతిపాదనలు పెడతాం. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట ఎత్తుపై మహారాష్ట్రతో సంప్రదిస్తున్నాం అని తెలిపారు.







