Champion: ఛాంపియన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్(srikanth) కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. కానీ చాలా తక్కువ టైమ్ లోనే రోషన్(Roshan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రోషన్ చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉండటంతో రోషన్ అందరి అటెన్షన్ ను అందుకున్నాడు.
నిర్మలా కాన్వెంట్(nirmala convent) తో తన కెరీర్ ను స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే మెప్పించిన రోషన్, తర్వాత పెళ్లి సందడి2(Pelli sandadi2) చేసి మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక రోషన్ హీరోగా వచ్చిన తాజా సినిమా ఛాంపియన్(champion). స్పోర్ట్స్, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఛాంపియన్ బాగానే పెర్ఫార్మ్ చేసింది.
ప్రదీప్ అద్వైతం(pradeep adviatham) దర్శక్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఛాంపియన్ సినిమా జనవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఈ సినిమా హక్కులను మంచి రేటుకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఛాంపియన్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.






