Peddi: పెద్దిలో ఆ సీనియర్ హీరోయిన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది(peddi). ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నాడు బుచ్చిబాబు. మొదటి నుంచే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తోడు సినిమా నుంచి రిలీజై గ్లింప్స్, చికిరి(Chikiri) సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. పెద్ది సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు(Tabu) ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. అయితే టబు క్యారెక్టర్ సినిమా మొత్తం ఉండదని, కేవలం ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తుందని, ఆమె క్యారెక్టర్ కథలో చాలా కీలకమని సమాచారం.
అంతేకాదు, ఈ మూవీ క్లైమాక్స్ లో ఓ యాక్సిడెంట్ లో హీరో కు కాళ్లు పోతాయని, అయినా సరే రన్నింగ్ లో పాల్గొని హీరో ఛాంపియన్ గా నిలుస్తాడని, సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెప్తున్నారు. కథ వినడానికి చాలా కొత్తగా ఉంది. ఇవన్నీ వింటుంటే బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్(game changer) డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై చరణ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మార్చి 27న పెద్ది రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.






