Ananth Sriram: ఆ పాట నా కెరీర్ ను టర్న్ చేసింది
టాలీవుడ్ లోని ఫేమస్ లిరిక్ రైటర్లలో అనంత్ శ్రీరామ్(Ananth sriram) కూడా ఒకరు. ఎన్నో పాటలకు సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ఆయన పాటల్లోని సాహిత్యంకు మెచ్చి ఆయన్ని ఇప్పటికే పలు అవార్డులు కూడా వరించాయి. అయితే ఎవరి లైఫ్ కు అయినా టర్నింగ్ పాయింట్ ఒకటుంటుంది.
అనంత్ శ్రీరామ్ కు కూడా అలాంటి టర్నింగ్ మూమెంట్ ఉందట. అదే ఊహలు గుసగుసలాడే(Oohalu Gusa Gusa lade) సినిమాలోని ఏం సందేహం లేదు(EM Sandeham ledhu) సాంగ్. నాగశౌర్య(Naga Shaurya), రాశీ ఖన్నా(Raashi Khanna) జంటగా వచ్చిన ఆ సినిమాలోని ఏం సందేహం లేదు సాంగ్ ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. పెద్ద సినిమాల్లోని సాంగ్ కు ఎంత రెస్పాన్స్ అయితే వస్తుందో ఆ సాంగ్ కు కూడా అంతే రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పాడు.
2013లో తన కెరీర్ డల్ అయిందని, పెద్ద సినిమాల అవకాశాలు రాలేదని, అలాంటి టైమ్ లో వచ్చిన ఈ సాంగ్ తన కెరీర్ ను టర్న్ చేసిందని, ఓ రకంగా చెప్పాలంటే ఈ సాంగ్ తన కెరీర్ కు పునరుజ్జీవం పోసిందని చెప్పాడు అనంత్. ఈ సాంగ్ హిట్టయ్యాక తనకు అవకాశాలు బాగా వచ్చాయని కూడా చెప్పాడు. 2005లో లిరిసిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అనంత్ శ్రీరామ్ ఇప్పటికే వెయ్యికి పైగా పాటలు రాశాడు.






