Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(bandla ganesh) ఏం చేసినా సెన్సేషనే. ఆయన స్టేజ్ ఎక్కినా, మైకు పట్టుకుని స్పీచ్ ఇచ్చినా ఆ రేంజే వేరు. ఆయనేం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయనెప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవడం ఖాయం. తాజాగా బండ్ల గణేష్ తిరుమలకు పాద యాత్ర చేపట్టబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra babu naidu) గతంలో అరెస్ట్ అయిన టైమ్ లో మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. మన లీడర్, దేశం మొత్తం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై వేసిన నిందలు తొలగిపోవాలని, జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీం కోర్టు గడపై నిల్చుని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని బండ్ల గణేష్ చెప్పారు.
తన ఇంటి గడప నుంచి తిరుమల కొండ వరకు పాద యాత్ర చేస్తానని మొక్కుకున్నానని, ప్రతీ తెలుగు వాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్లీ మంచి విజయం అందుకుని పూర్వ వైభవం సాధించుకున్నారని, రీసెంట్ గా కేసులన్నీ కొట్టేశారని, దీంతో తన మనసు కుదుటపడి, తన మొక్కును తీర్చుకోవడానికి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్టు తన పోస్ట్ లో రాసుకొచ్చారు బండ్ల గణేష్.
https://x.com/ganeshbandla/status/2012730238372131320?s=20






