US Crude Oil: అమెరికా నుంచి భారత్‌కు పెరిగిన ముడిచమురు దిగుమతులు
అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు (US Crude Oil) భారీగా పెరిగింది. ఈ వివరాలను గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత యూఎస్‌తో ముడిచమురు ఒప్పందాలు పెరిగినట్లు డేటా సూచిస్తోంది. డేటా ప్రకారం, అక్టోబర్ 27 నాటికి అమెరికా నుండి మనదేశం రోజుకు 5.40 లక్షల బ్యారెళ్ల ముడిచమురును (US Crude Oil) దిగుమతి చేసుకుంటోంది. 2022 ఈ స్థాయిలో ముడిచమురు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. నెల ముగిసే నాటికి ఈ దిగుమతులు 5.75 లక్షల బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. నవంబర్‌లో కూడా రోజుకు 4 లక్షల నుంచి 4.5 లక్షల బ్యారెళ్ల (US Crude Oil) మధ్య దిగుమతులు ఉంటాయని అంచనా. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు సగటున దిగుమతులు 3 లక్షల బ్యారెళ్లుగా ఉన్నాయి.
రష్యా ఇప్పటికీ అగ్రస్థానంలోనే
భారత్ ముడిచమురు దిగుమతుల్లో అమెరికా వాటా (US Crude Oil) పెరుగుతున్నప్పటికీ.. రష్యానే ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ముడిచమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. భారత్‌కు సగటున 17.5 లక్షల బ్యారెళ్ల డెలివరీలు రష్యా (Russia Crude Oil) నుండే జరుగుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా ఉన్నాయి.







