Jaishankar: మార్కో రూబియోతో జైశంకర్ భేటీ.. ట్రేడ్ డీల్పైనే చర్చలు?
కౌలాలంపూర్లో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోను భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ (Jaishankar) కలిశారు. ఈ భేటీ గురించి సోషల్ మీడియా వేదికగా జైశంకర్ వెల్లడించారు. ‘సెక్రెటరీ మార్కో రూబియోను (Marco Rubio) కౌలాలంపూర్లో కలవడం సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక బంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలను చర్చించుకున్నాం’ అని ఆయన తెలిపారు.
అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ (India-US Trade Deal) చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







