Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఎస్పీవీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ( ఎస్పీవీ) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక ప్రాజెక్టుల అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలు ఎస్పీవీ (SPV) తీసుకోనుంది. ఈ మేరకు ఎస్పీవీ డైరెక్టర్లు, వాటాదారులను నామినేట్ (Nominate) చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీవీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, డైరెక్టర్లుగా ఆర్థిక, ఇంధన, రవాణా, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్డీఏ కమిషనర్ (CRDA Commissioner) ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.







