The Raja Saab: రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ది రాజా సాబ్(the raja saab). సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది రాజా సాబ్ కు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ వచ్చింది. కానీ కథ, కథనం విషయంలో మారుతి మాత్రం చాలా గట్టిగానే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ రాజా సాబ్ కు మంచి కలెక్షన్లే వచ్చాయి.
ఈ సినిమా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం రాజా సాబ్ పై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. అయితే రాజా సాబ్ ఇప్పటికే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రావడమే తరువాయి. ఈ నేపథ్యంలో రాజా సాబ్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
వారి ఎదురుచూపులకు చెక్ పెడుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ ది రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ ను ఇచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రాజా సాబ్ ఓటీటీ లోకి రానున్నట్టు హాట్స్టార్ తెలిపింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా రాజాసాబ్ ఓటీటీలోకి రాబోతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న రాజా సాబ్ ఓటీటీలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.






