Koti: ఆ మూవీ టీమ్ పై కోటి ఫైర్
ఈ మధ్య ఓల్డ్ సాంగ్స్ ను రీమిక్స్ చేసి కొత్తగా వాడటం ఫ్యాషనైపోయింది. కె ర్యాంప్(K Ramp) లో ఇదేమిటమ్మా(Idhemitamma), మన శంకరవరప్రసాద్ గారు(MSG) మూవీలో సుందరి(Sundari) సాంగ్స్ ను అలానే వాడారు. ఆ సాంగ్స్ వల్ల సినిమాకు ఎంతో మేలు జరిగింది. అలా అని ఆ పాటలను పర్మిషన్స్ లేకుండా వాడితే నిర్మాతలు తర్వాత చాలానే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే ఆడియో కంపెనీ వద్ద కొంత డబ్బు చెల్లించి, పర్మిషన్స్ తీసుకుని ఆపైనే వాడతారు.
ఇక అసలు విషయానికొస్తే రీసెంట్ గా డెకాయిట్(Dacoit) మూవీ టీజర్ లో కన్నె పెట్టరో కన్ను కొట్టరో(kanne pettaro kannu kottaro) సాంగ్ ను వాడారు. అడివి శేష్(adivi sesh) హీరోగా, మృణాల్ ఠాకూర్(mrunal thakur) హీరోయిన్ గా షానిల్ డియో(shaniel deo) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ మార్చి 19న రిలీజ్ కానుండగా, ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ లోని రీమిక్స్ సాంగ్ ను చూసి ఆ సాంగ్ ను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి(koti) ఫైర్ అయ్యారు.
డెకాయిట్ మూవీలో కన్నె పెట్టరో సాంగ్ ను రీసెంట్ గా డెకాయిట్ మూవీలో వాడారని, ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి కనీసం ఏ ఒక్కరూ తనను సంప్రదించి, తన అనుమతి తీసుకోలేదని, కనీసం కర్టసీకి కూడా క్రెడిట్స్ ఇవ్వలేదని కోటి ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్లకు విలువ తగ్గిపోతుందని, ఒక మాట అడిగితే ఎవరూ కాదనరని ఆవేదన వ్యక్తం చేశారు.






