Indians Deported: యూఎస్ నుంచి 54 మంది భారతీయుల డిపోర్టేషన్.. అక్రమంగా వచ్చారంటూ..!
వలసదారుల విషయంలో అమెరికా కఠిన వైఖరి కొనసాగుతోంది. తాజాగా తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే కారణంతో 54 మంది భారతీయులను అమెరికా వెనక్కి (Indians Deported) పంపింది. ఈ బృందం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. వారిని వారి కుటుంబాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ 54 మందిలో ఎక్కువ మంది హర్యానా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా కర్నాల్, ఖైతాల్, అంబాలా, యమునా నగర్, కురుక్షేత్ర, జింద్, సోనిపట్ వంటి ప్రాంతాల నుండి ‘డంకీ’ మార్గం (Dunki Route) (అనధికారిక/ప్రమాదకర మార్గం) ద్వారా అమెరికాకు చేరుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇలా అక్రమంగా అక్రమంగా విదేశాలకు వెళ్లడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని అధికారులు హెచ్చరించారు. వీరికి సమకరించిన ఏజెంట్లపై ఫిర్యాదులు ఇంకా అందలేదని తెలిపారు. హర్యానాకు చెందిన 16 మందిని (Indians Deported) ఇప్పటికే వారి కుటుంబాల వద్దకు చేర్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డంకీ మార్గాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.







