Amrutha Iyer: ట్రెండీ స్కర్ట్ లో ఎట్రాక్ట్ చేస్తున్న హనుమాన్ బ్యూటీ
అమృత అయ్యర్(amrutha iyer) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. హనుమాన్(hanuman) మూవీతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న అమృత అయ్యర్ ఆఖరిగా బచ్చలమల్లి(Bachalamalli) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న అమృత, తాజాగా తన ఫ్రెండ్స్ తో పాటూ సరదాగా గడిపిన మెమొరీస్ ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమృత ముదురు నీలం కలర్ స్లీవ్ లెస్ ధరించింది. బోల్డ్ స్లిట్ తో ఉన్న ఆ స్కర్ట్ అమృత లుక్స్ ను మరింత ఎలివేట్ అయ్యేలా చేయగా ఈ ఫోటోలకు యూత్ లైకులు కొడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.







