Anil Ravipudi: ప్రమోషన్స్ కోసం టెక్నాలజీని వాడుకుంటున్న అనిల్
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రోజుకో వింత చూసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం బాగా ఎక్కువైపోయింది. అయితే దాన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో లేక ఉన్న జ్ఞానాన్ని పెంచుకోవడానికో వాడితే బాగానే ఉంటుంది కానీ కొందరు ఆ టెక్నాలజీని వాడి ఎన్నెన్నో దారుణాలు సృష్టిస్తున్నారు.
మొత్తానికి ఏఐ వల్ల ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉండగా, తాజాగా ఈ ట్రెండ్ లో టాలీవుడ్ లో హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఏఐ ను వాడి ఓ క్రేజీ వీడియోను రెడీ చేసి దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అనిల్ అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో ఒకే దగ్గర ఖైదీ చిరంజీవిని, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రీ, జగదేక వీరుడు అతిలోక సుందరి లోని చిరంజీవి పాత్రల నుంచి ఇప్పుడు మన శంకరవరప్రసాద్ మూవీ వరకు డిజైన్ చేసి ఆ వీడియోను తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ దాన్ని చూసి ట్రెండ్ ను వాడుకుని దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో అనిల్ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://x.com/AnilRavipudi/status/2002693990156775659?s=20






