Revanth Reddy: మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షహీన్ నగర్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్గా పనిచేసిన మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్.
పీర్ షబ్బీర్ గారు సామాజిక సేవకుడు. మైనారిటీ, మెజారిటీ మధ్యనే కాదు… హిందూ ముస్లింలు కలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారు. వారి మరణం ముస్లిం సోదరులకే కాదు, తెలంగాణకు తీరని లోటు. రాష్ట్రంలో వారు చేసిన సేవలు మరువలేనివి. ఆయన లేకపోవడం బాధాకరం.. అందుకే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చా. మైనారిటీ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. వారి సేవలను శాశ్వతంగా గుర్తించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వారి ఆశయాలకు అనుగుణంగా మైనారిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.







