Chandrababu: సహాయ చర్యల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే : చంద్రబాబు
జిల్లాల్లో తుపాను సహాయ చర్యల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. సీఎం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ జిల్లాల్లో వర్షాల ప్రభావంపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చే వారిని సహాయ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. మొంథా తుపాను ముప్పు ఎదురయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మానవ ప్రయత్నంలో ఎలాంటి అలసత్యం కనిపించకూడదని స్పష్టం చేశారు. కాలువ గట్లు తెగకుండా చూడాలన్నారు. విజయవాడ (Vijayawada) , విశాఖపట్నం, మంగళగిరి తదితర కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.







