India: రష్యా నుంచి ఆపేస్తేనే.. భారత్ తో చర్చలు

భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్యలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ (Howard Lutnick) స్పందించారు. రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు ఆపేసిన తర్వాతే వాటిపై ముందుకు వెళ్తామనే సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇటీవల ట్రంప్ ( Trump) -మోదీ (Modi) ల స్నేహపూర్వక ట్వీట్‌లకు ముందు తీవ్ర హెచ్చరికలు చేసి లూట్నిక్ తాజాగా స్పందించారు. ప్రపంచ దేశాలపై అమెరికా (America) సుంకాలు విధిస్తూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఏ వాణిజ్య సమస్యపై ఎక్కువ దృష్టి పెట్టారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్ పేరును ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయం నిలిపివేసిన తర్వాత భారత్‌తో ముందుకెళ్తామన్నారు.