China: అమెరికాకు చైనా వార్నింగ్

తమను అదుపు చేయాలనుకోవడం, లేదా తమ విషయాల్లో జోక్యం చేసుకొనే ప్రయత్నాలు చేయొద్దని చైనా( China) అమెరికాను హెచ్చరించింది. అమెరికా(America) రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ (Pete Hegseth) , చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ (Dong Jun) లు వర్చువల్‌గా సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్ (Nepal)లో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితులతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు. స్వాతంత్య్రాన్ని మద్దతు ఇస్తున్నామంటూ చైనాను అదుపు చేసేందుకు తైవాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని చూడొద్దని డాంగ్ పేర్కొన్నారు. తమ విషయాల్లో జోక్యం చేసుకొనే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన యూఎస్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా తైవాన్ తమ భూభాగంలో భాగమని ఆయన స్పష్టం చేశారు.