Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా(ilayaraja) గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కొన్ని వేల సాంగ్స్ ను కంపోజ్ చేసిన ఆయన గత కొన్నాళ్లుగా సినిమాల ద్వారా పెద్దగా మార్క్ వేయలేకపోయినా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇళయరాజా ఉడుపి(Udupi)లోని కొల్లూరు(kolluru) మూకాంబిక అమ్మ(Mookambika Ammavaru) వారికి రూ. 4 కోట్ల విలువైన ఆభరణాలను సమర్పించారు.
అమ్మ వారికి వజ్రాల కిరీటం, వీరభద్ర స్వామికి భారీ విలువ చేసే బంగారు ఖడ్గాన్ని ఇచ్చారు. ఇళయరాజా ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత సుబ్రహ్మణ్య అడిగ సమక్షంలో ఆ ఆభరణాలను ఆలయానికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అతని కొడుకు కార్తీక్ రాజ్(karthik Raj) తో పాటూ మనవడు యతీష్(Yatheesh), కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
పూజలు పూర్తయ్యాక ఆలయ ప్రధాన అర్చకులు ఇళయరాజాకు తీర్థ ప్రసాదాలతో పాటూ అమ్మవారి ఫోటోను కూడా అందచేశారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ, జగన్మాత మూకాంబిక ఆశీస్సులతోనే ప్రతీదీ సాధ్యమైందని, ఇందులో తాను చేసిందేమీ లేదని చెప్పారు. అయితే ఇళయరాజా 2006లో కూడా అమ్మవారికి ఓ కిరీటాన్ని ఇచ్చారని ఆలయ మేనేజింగ్ కమిటీ తెలిపింది.