Sai Marthand: ఫ్యాన్ వార్స్ ను వాడుకున్నా

లిటిల్ హార్ట్స్(little hearts) సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి మార్తాండ్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఒక సాధారణ కథకు మంచి ఫన్, వినోదాన్ని జోడించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు సాయి మార్తాండ్. అయితే సాయి మార్తాండ్(sai marthand) సినిమాల్లోకి రాకముందు మీమ్ క్రియేటర్ గా ఉన్నాడు. అలానే ఆయన ఫేమస్.
మీమర్ గా ఆయనకున్న ఎక్స్‌పీరియెన్స్ ను సాయి మార్తాండ్ సినిమాలో ప్రతీ చోటా వాడుకున్నాడు. అంతేకాదు ఆ విషయాన్ని ఓపెన్ గా కూడా చెప్పాడు. తాను ఎంతో తెలివిగా సోషల్ మీడియా ను వాడుకుని తన క్రియేటివిటీకి పదును పెట్టి ఇండస్ట్రీలోకి వచ్చానని సాయి మార్తాండ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పొన్నియన్ సెల్వన్(ponniyan selvan) టైమ్ లో జరిగిన డిస్కషన్స్ లో తాను కూడా పాల్గొన్నానని చెప్పాడు.
ఆ టైమ్ లో జరిగిన ఫ్యాన్ వార్ తనకు సినిమాల్లోకి రావడానికి ఉపయోగపడిందని, ఒకసారి ట్విట్టర్ స్పేస్ లో ఓ బ్యానర్ కు చెందిన మార్కెటింగ్ హెడ్ కూడా పాల్గొన్నారని, ఆ టీమ్ లోని వాళ్లు తన గురించి పాజిటివ్ గా మాట్లాడటం వల్ల ఆ నిర్మాతతో పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి దారి చూపించిందని, అదే తనను ఇవాళ ఈ స్థాయికి తెచ్చిందని చెప్పాడు సాయి మార్తాండ్.