America: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. డాలస్ (Dallas) నగరంలోని ఓ మోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య (Chandramouli Nagamallaiah) ను సహోద్యోగి కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. మల్లయ్య, మార్టినెజ్ (Martinez) ల మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. నిందితుడు మార్టినెజ్ మోటల్‌లో గదిని శుభ్రం చేస్తుండగా , విరిగిపోయిన వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించవద్దని మల్లయ్య తెలిపాడు. ఈ విషయాన్ని మల్లయ్య డైరెక్ట్‌గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడంతో మార్టినెజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆవేశంలో మార్టినెజ్, మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచాడు. అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన మల్లయ్యను వెంటాడి అతని తలను నరికి చెత్పకుప్పలో పడేశాడు. ఈ దాడిని ఆపేందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.