India: భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధానం : సెర్గీ గోర్

భారత్-అమెరికాల మధ్య టారిఫ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలపై భారత్ (India) కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ (Sergey Gore) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను చైనా (China) కు దూరం చేసి యూఎస్ (US) కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను యూఎస్ వైపునకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమని గోర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో దాన్ని చైనా నుంచి దూరం చేయాల్సి ఉందన్నారు. తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయన్నారు. యూఎస్ మొత్తం జనాభా కంటే భారత్‌లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువన్నారు. ఆ దేశ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందన్నారు.