Rahul Gandhi: అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమెరికా (America) పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడిరచినట్లు సమాచారం. ఏప్రిల్ 19 నుంచి రాహుల్ అగ్రరాజ్యం లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన బ్రౌన్ యూనివర్సిటీ (Brown University ) ని సందర్శిస్తారు. బోస్టన్ (Boston) లో ప్రవాస భారతీయుల (Indians) తోనూ రాహుల్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఆయన యూఎస్‌లో ఎన్ని రోజులు పర్యటిస్తారనేది తెలియదు. అంతేకాక దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక, గతేడాది సెప్టెంబరులో మూడు రోజులు రాహుల్ అమెరికాలో పర్యటించారు.