Putin: పుతిన్ మైండ్ గేమ్.. అమెరికాకు సూపర్ షాక్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin).. ఈ యన ఓ డిక్టేటర్.. ఆయన చెప్పిన మాట కాదన్న వారెవ్వరూ వారి దేశంలో ఇప్పుడు బతికి బట్టకట్టిన పరిస్థితులు లేవు. ఎందుకంటే ..తన మాటే వేదం.. తన ఆదేశం.. తిరుగులేని శాసనం . అంతే కాదు.. ఆయన బయటకు ఓ అధ్యక్షుడిలా ఉన్నా.. ఆయన జీవితంలో కొంత భాగం.. ఓ గూఢచారిగా సాగింది. ప్రత్యర్థి దేశాలు ముఖ్యంగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల ఏజెంట్లను బోల్తా కొట్టించి, విలువైన సమాచారాన్ని సేకరించడంలో పుతిన్ అసమాన్య ప్రతిభావంతుడు.. ఈవిషయాన్ని ప్రత్యర్థి దేశాలు సైతం అంగీకరిస్తాయి కూాడా.. అందుకే పుతిన్ తో బేటీ అంటేనే పాశ్చాత్యదేశాల నేతల్లో ఓ విధమైన ఆందోళన ఉంటుంది.
మాస్కో అధినేత ఎప్పుడూ తనదైన శైలిలో మైండ్‌గేమ్స్‌తో వారిని దిగ్భ్రాంతికి చేస్తుంటారనే పేరుంది. ఓ సారి జర్మనీ నేత వద్దకు పెంపుడు కుక్కను పంపి భయపెట్టగా.. మరో సారి ఫ్రాన్స్ నేతను అల్లంత దూరంలో కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ సారి వంతు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ది. ఇటీవల ట్రంప్ తరఫున రాయబారానికి వచ్చిన ఆయనకు పుతిన్ ఓ షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారు.
అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ ఇటీవల పుతిన్‌కు ట్రంప్ సందేశం చేరవేసేందుకు క్రెమ్లిన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తళతళలాడుతున్న ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ పతకాన్ని తీసుకొచ్చి రష్యా అధినేత వాషింగ్టన్ దూతకు ఇచ్చారు. దానిని సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ జూలియన్ గల్లినాకు అందజేయాలని సూచించారు. రష్యా తరఫున సదరు అధికారిణి 21 ఏళ్ల కుమారుడు మైఖెల్ గ్లోస్ ఉక్రెయిన్‌తో పోరాడి మరణించాడని.. అతడి సాహసానికి గౌరవంగా ఈ పతకం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం జూలియన్ సీఐఏ డిజిటల్ ఇన్నోవేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. పుతిన్ అవార్డ్ ఇచ్చిన సమయం సందర్భాన్ని చూస్తే కచ్చితంగా ఇది ఆయన మైండ్‌గేమే అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సీఐఏ ఉన్నతాధికారిణి కుమారుడే రష్యా పక్షాన పోరాడాడు అనే ప్రశ్నలు లేవనెత్తడానికే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఇక యుద్ధ రంగంలో మరణించినట్లు చెబుతున్న గ్లోస్ సోషల్ మీడియాలో రష్యాకు మద్దతుగా పోస్టులు పెట్టాడు. మాస్కోలో దిగిన చిత్రాలు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 4వ తేదీన తూర్పు యూరప్ లో అతడు మరణించినట్లు చెబుతున్నారు. అతడి మృతదేహం అమెరికా చేరుకొన్న వేళ.. 2025 ఏప్రిల్‌లో సీఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రోస్ మరణం జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాదని.. అతడు చాలా మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. తమ అధికారిణి జూలియన్ కుటుంబం తీవ్ర విషాదాన్ని చవి చూశారని వెల్లడించింది. మైఖెల్ గ్లోస్ తండ్రి లారీ గ్లోస్ మీడియాతో మాట్లాడుతూ తమ కుమారుడు రష్యా సైన్యంలో చేరాడని, ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్నాడని తమకు తెలియదన్నారు.







