Donald Trump: అమెరికా అధ్యక్షుడికి పుతిన్ కానుక

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ట్రంప్‌నకు ఓ కానుక (Gift) ను బహూకరించారు. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించింది. ఇటీవల ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్ కాఫ్ (Steve Wittkoff) మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలో విట్‌కాఫ్‌కు ట్రంప్ చిత్రపటాన్ని ఇచ్చి దానిని ట్రంప్‌నకు అందించాలని కోరినట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) తెలిపారు. విట్‌కాఫ్ గతవారం ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆ బహుమతిని అందమైనదిగా అభివర్ణించారు.