పశ్చిమాసియా శాంతికి ప్రయత్నాలు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం దేశాలైన పాకిస్తాన్ తుర్కియే, ఈజిప్టు .. శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. దీనికి సంబందించి ఒక ముసాయిదా ప్లాన్‌ను రెండు దేశాలకు అందించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆ ప్లాన్‌లో 45 రోజుల కాల్పుల విరమణ, హర్మూజ్‌ను తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కోసం తమ దేశం హర్మూజ్ జలసంధిని తెరవబోదని ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై భారత్‌లో ఇరాన్ అంబాసిడర్ డాక్టర్ మహమ్మద్ ఫతాలీ స్పందించారు. శాశ్వత శాంతికి హామీలేని ఇలాంటి ప్రయత్నాల పట్ల తాము జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇలా ఘర్షణలు, కాల్పులు విరమణ వంటి విషయాల్లో తమకు మంచి అనుభవాలేం లేవన్నారు. అయితే రెండు దేశాల నుంచి ఈ ప్లాన్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పారామిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి..
అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) దాడుల్లో తమ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మాజిద్ ఖాదేమీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి






