BRICS: బ్రిక్స్ ను చూసి ట్రంప్ ఎందుకు భయపడుతున్నారు.. అసలీ బ్రిక్స్ బలమెంత..?

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా.. దేశాల కూటమిని బ్రిక్స్ (BRICS) అని పిలుస్తారు. ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్ వచ్చి చేరాయి. ఈ కూటమి నిజానికి చాలా బలమైన కూటమిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఆసియాకు చెందిన రెండు అతిపెద్ద దేశాలు ఇండియా (India), చైనా (China) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇక అగ్రరాజ్యాల్లోగా ఒకటిగా పిలిచే రష్యా (Russia) కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడీ దేశాలు నెమ్మదిగా డాలర్ ప్రాభవాన్ని తగ్గించి, తమ కరెన్సీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఈపరిణామం ట్రంప్ కు అస్సలు నచ్చడం లేదు. అందుకే బెదిరింపులకు దిగుతున్నారు.
ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచంలో ప్రధాన కరెన్సీగా ఉంది. అయితే ఈ మూడు దేశాలు తమ వాణిజ్యాన్ని రూపాయి, యువాన్, రూబుల్ వంటి తమ సొంత కరెన్సీలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కూటమి ఏర్పడితే ఒక కొత్త కరెన్సీ లేదా చెల్లింపు వ్యవస్థను రూపొందించి డాలర్‌కు సవాలు విసిరే అవకాశం ఉంది.ఈ మూడు దేశాలు కలిసి ఒక ఆసియా వాణిజ్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయగలవు. దీని ద్వారా ముడిసరుకు, తయారీ, సాంకేతికతను పంచుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చగలవు.
రక్షణ, సాంకేతికతలో బలోపేతం
చైనా బలమైన తయారీ శక్తి, భారత్ నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ఐటీ సామర్థ్యం, రష్యా అధునాతన సాంకేతికత కలగలిస్తే రక్షణ, సాంకేతిక రంగాలలో ఈ కూటమి ఒక అపారమైన శక్తిగా ఉద్భవించగలదు.ఈ కూటమి ఏర్పడితే ప్రపంచ దేశాలు పశ్చిమ దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలు భారత్-చైనా-రష్యాతో వాణిజ్యం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. తద్వారా గ్లోబల్ సప్లై చైన్‌లో మార్పులు వస్తాయి.
ఈ కీలక కూటమి సాధ్యమేనా?
ఈ మూడు కీలక దేశాల కూటమి ఏర్పడటం ప్రస్తుతం అంత సులభం కాదు. దీనికి అనేక రాజకీయ, సామాజిక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. భారత్, చైనాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, పరస్పర అపనమ్మకం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే భారత్ బహుళ అలీన విధానాన్ని అనుసరిస్తుంది.. అంటే అన్ని దేశాలతో సమానమైన సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతానికి ట్రంప్ సుంకాల బెదిరింపుల వల్ల అమెరికాకు జరిగే నష్టం కంటే భారత్‌కు పెద్దగా నష్టం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ సుంకాల బెదిరింపులు ఎక్కువ కాలం నిలబడకపోవచ్చని చెబుతున్నారు.