Donald Trump: డబ్ల్యూటీవోకు నిధులు నిలిపేసిన అమెరికా

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) చేపట్టిన చర్యల్లో భాగంగా తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) (WTO ) కు అందించే నిధుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రపంచస్థాయి వేదికల నుంచి అమెరికా (America) ను తప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగినట్లు ప్రకటించారు. తాజాగా డబ్ల్యూటీవోకు నిధుల (Funds) ను నిలిపివేశారు.