బే ఏరియాలో ఘనంగా పాఠశాల 13వ వార్షికోత్సవం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) సంయుక్తంగా నిర్వహించిన పాఠశాల 13వ వార్షికోత్సవం (వసంతోత్సవం) అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులతో కలిపి దాదాపు 500 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్షికోత్సవంలో భాగంగా సుమారు 6 గంటల పాటు సాగిన కార్యక్రమాలు వచ్చిన అతిథులందరికీ కనువిందు చేసింది. గుణపాఠం (నాటిక), పరమానందయ్యగారి శిష్యులు (నాటిక), శివసంకల్పం (నాటిక)ను పిల్లలు ప్రదర్శించారు. వీటితో పాటు శ్లోకాలు, పద్యాలు, గేయాలను పాఠశాల పిల్లలు ఆలపించారు.కార్యక్రమంలో అత్యంత ఆసక్తికరమైన అంశం గ్రాడ్యుయేషన్ వాక్. వివిధ కేంద్రాలకు చెందిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వేదికపై నడుస్తూ వచ్చి సర్టిఫికెట్లు అందుకున్నారు. రంగురంగుల బ్యానర్లు, కళాఖండాలు మరియు పూలతో అలంకరించిన ఆడిటోరియం పండుగ వాతావరణాన్ని తలపించింది. అతిథులు మరియు నిర్వాహకులు అందరూ సంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు.
ఇవి కూడా చదవండి

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం. భరత్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీ జయరాం కోమటి హాజరై పాఠశాల బృందాన్ని అభినందించారు. ప్రవాస తెలుగు పిల్లలు ప్రదర్శించిన అద్భుతమైన ప్రదర్శనలను చూసి వారు ఆశ్చర్యపోయారు.
తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, తానా ఈవీపీ శ్రీనివాస్ లావు ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సుధీర్ వున్నం (తానా ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతీయ ప్రతినిధి), భాను మాగులూరి (పాఠశాల చైర్మన్), ప్రసాద్ మాంగిన (పాఠశాల కో-చైర్మన్), శివ కాడ (బాటా ప్రెసిడెంట్), విజయ ఆసూరి (అడ్వైజర్), డాక్టర్ రమేష్ కొండ (అడ్వైజర్) మరియు డాక్టర్ గీతా మాధవి (కరికులమ్ డైరెక్టర్) పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. వారు పాఠశాల ఉపాధ్యాయులు మరియు సమన్వయకర్తల కృషిని ప్రశంసించారు. పాఠశాల ఏటేటా వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం బే ఏరియాలో 250 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని వారు పేర్కొన్నారు. ఎనఆరఐ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకునేలా ఉండటం పాఠశాల యొక్క ప్రత్యేకత అని వివరించారు. తెలుగు భాషను మరియు సంస్కృతిని భావి తరాలకు అందించడమే పాఠశాల కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని వారు వెల్లడించారు. తానా బృందం సభ్యులు సుధీర్ వున్నం (తానా ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతీయ ప్రతినిధి), వెంకట్ అడుసుమిల్లి (తానా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్), భక్త బల్లా (తానా ఫౌండేషన్ సెక్రటరీ), శ్రీకాంత్ దొడ్డపనేని (ఫౌండేషన్ ట్రస్టీ), వెంకట్ కోగంటి (తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్) మరియు ఇతర తానా నాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
బాటా అధ్యక్షులు శివ సంతోషం వ్యక్తం చేస్తూ.. పాఠశాల కార్యక్రమంలో బాటా బృందం పూర్తిగా భాగస్వామ్యం అయిందని, తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బాటా కార్యవర్గ కమిటీ సభ్యులైన వరుణ్ (వైస్ ప్రెసిడెంట్), హరి ఎస్, సందీప్ కె మరియు సంకేత్లను పరిచయం చేశారు.
స్టీరింగ్ కమిటీలో రవి తిరువీధుల, కామేష్ మళ్ళ, యశ్వంత్ కుదరవల్లి మరియు సుమంత్ పుసులూరి సభ్యులుగా ఉన్నారు.
కల్చరల్ డైరెక్టర్లుగా శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, శిరీష బత్తుల మరియు తారక దీప్తి నామినేటెడ్ కమిటీలో సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఇనాంపూడి మరియు సుధాకర్ బైరి యూత్ కమిటీ సభ్యులుగా గౌతమి మరియు సింధు, అడ్వైజరీ బోర్డు సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మాంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి మరియు హరినాథ్ చికోటి ఈ వేడుకను విజయవంతం చేసినందుకు బాటా బృందాన్ని అభినందించారు.
బే ఏరియా పాఠశాల సమన్వయకర్తలు శ్రీదేవి ఎర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, రవి పోచిరాజు, సునీత రాయపనేని, టీచర్లు శ్రీకాంత్ దాసరధి, షీలా గోగినేని, శరత్ పోలవరపు, దీప్తి మందలి, రాగిణి అరసద, పద్మ సొంటి, శ్రీదివ్య యలమంచి, శ్యామ్ బాలే, శ్రీనివాస్ కొల్లి మరియు విలేఖ్య వెనిగళ్ళ తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు.
కార్యక్రమ వేదిక వద్ద విద్యార్థుల నమోదు కోసం రిజిస్ట్రేషన్ బూత్ మరియు ఈ-లెర్నింగ్ పై డెమో ఏర్పాటు చేశారు. అతిథులందరికీ “భీమవరం రుచులు” వారిచే అత్యంత రుచికరమైన విందు భోజనం వడ్డించారు.
ఇవి కూడా చదవండి