NATS: అమెరికాలో మళ్ళీ తెలుగు పండుగ.. డల్లాస్ వేదికగా 2027 నాట్స్ సంబరాలకు రంగం సిద్ధం!
NATS: అమెరికాలో తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే ‘ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ’ (NATS) తన 9వ అమెరికా తెలుగు సంబరాలను 2027లో డల్లాస్ వేదికగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డల్లాస్లో జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో 2026-27 నాట్స్ కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిర్వాహకుల కీలక నిర్ణయాలు:
ఈ సమావేశంలో నూతనంగా నాట్స్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కంచర్ల నందకిశోర్ను పలువురు ప్రవాస ప్రముఖులు సత్కరించారు. గతంలో 2013, 2019లో డల్లాస్లో విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించామని, ఇప్పుడు 2027లో మళ్లీ డల్లాస్లో వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా తన హయాంలో కృషి చేస్తానని నందకిశోర్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
50 రాష్ట్రాలకు విస్తరణ:
నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ, ప్రస్తుతం 28 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థను, త్వరలోనే అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ఉన్న తెలుగువారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మాదాల రవి, నాదెళ్ల రవికుమార్ వంటి వారి కృషితో నాట్స్ రూపుదిద్దుకుంది సలహామండలి సభ్యుడు డాక్టర్ కొత్తా శేఖరం గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులకు ‘సేవ పురస్కారాలు’ అందజేశారు. అదేవిధంగా బోర్డు సమావేశంలో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.
ఇవి కూడా చదవండి
