ఆటా మహాసభలకు హారిస్బర్గ్ కమ్యూనిటీ మద్దతు.. కన్వెన్షన్ కిక్ఆఫ్ మీటింగ్ విజయవంతం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా జాతీయ మహాసభలు, యువజన సదస్సును పురస్కరించుకుని హారిస్బర్గ్లో నిర్వహించిన ‘గ్రీట్ అండ్ మీట్’, ‘కన్వెన్షన్ కిక్ఆఫ్’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక తెలుగు కమ్యూనిటీ నుంచి సుమారు 100 మందికి పైగా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, తెలుగు కమ్యూనిటీకి ఆటా అందిస్తున్న వివిధ సేవలను, నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. బాల్టిమోర్ కన్వెన్షన్ మహాసభల గురించి కూడా మాట్లాడుతూ, ఈ మహాసభల విశిష్టతను తెలియజేస్తూ, హారిస్బర్గ్ తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆటా హారిస్బర్గ్ లోకల్ చాప్టర్ రీజినల్ కోఆర్డినేటర్ విభీషణ్ రెడ్డి నేతృత్వంలో కోర్ టీమ్ సభ్యులు చిత్రారెడ్డి బుర్రి, లక్ష్మణ్ బుద్దినేని, సాంబశివ రెడ్డి ఎల్లంకి, సంతోష్ మిట్టపల్లి, రాజ్ కాట్ల, రాకేష్ పైడి, మరియు ఎస్.వి.ఆర్ రెడ్డి తమ సమిష్టి కృషితో ఈ వేడుకను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్-ఎలక్ట్ సతీష్ రెడ్డి డల్లాస్ నుండి వర్చువల్‌గా పాల్గొనగా, మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి తదితర ప్రముఖ నాయకులు స్వయంగా హాజరయ్యారు. ఈ కిక్ఆఫ్ ఈవెంట్లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్రీనివాస్ దర్గుల, రాజ్ కక్కెర్ల, ఫిలడెల్ఫియా రీజినల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ కోమటిరెడ్డి, రీజినల్ అడ్వైజర్ రమణ కోతతో పాటు స్థానిక సంస్థలైన HTA, TANA, మరియు ATA ప్రతినిధులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన స్పాన్సర్లు కిరణ్ గుడూర్ (జీనియస్ కిడ్స్), విక్రమ్ పచిచా, మరియు రాజ్ కాట్లకు ఆటా బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ఇవి కూడా చదవండి
