Big Boss: ఓటీటీ లో బిగ్ బాస్ 8 సీజన్: ఓ సరికొత్త చరిత్ర

ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఎంటర్టైన్మెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో వత్తిడి నుంచి విశ్రాంతి పొందటానికి చాలామంది సినిమాలు, టీవీ షోలు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై (OTT platforms) ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని షోలు ట్రెండ్ సెట్ చేస్తూ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Big Boss).
బిగ్ బాస్ అనే ఈ గ్రాండ్ షో మొదట హిందీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఓ పాన్ ఇండియా షోగా నిలిచింది. హిందీలో ఇప్పటికే 18 సీజన్లను పూర్తి చేసిన ఈ షో, తెలుగులో ఎన్టీఆర్ (NTR) హోస్టింగ్ తో మొదలైంది. మొదటి సీజన్ నుంచే ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా తెలుగులో బిగ్ బాస్ టాప్ రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా నిలిచింది.
ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ (Big Boss season 8) ఘనంగా ముగిసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి గ్రాండ్ ఫినాలే వరకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. సాధారణంగా బిగ్ బాస్ షోలో తొలి ఎపిసోడ్ మరియు ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్స్‌ను రివీల్ చేస్తారు. కానీ ఈ సీజన్‌లో కేవలం టెలివిజన్ ద్వారా కాకుండా, ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చేశారు.
స్టార్ మా(Star Maa) , హాట్‌స్టార్(Hotstar ) తాజా ప్రకటన ప్రకారం, బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఏకంగా 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. అంతేకాదు, 2 బిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల రికార్డు కూడా నమోదు చేయడంతో ఈ ఎపిసోడ్ ఒక చరిత్రాత్మక ఘనత సాధించింది. ఈ సంఖ్యలు ఒక IPL మ్యాచ్‌కి సమానంగా ఉన్నాయంటే బిగ్ బాస్ తెలుగు 8 పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సెన్సేషనల్ రికార్డు సాధించడమే కాకుండా, బిగ్ బాస్ షో ఈ సీజన్ లో ప్రేక్షకుల్ని ప్రతి ఎపిసోడ్‌తో ఆకట్టుకుంది. సీజన్ 8 ద్వారా బిగ్ బాస్ తెలుగు మరోసారి తన ప్రాధాన్యతను నిరూపించుకోవడంతో పాటు రియాలిటీ షోల ప్రామాణికాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది.