ది ప్యారడైజ్ సెకండ్ సాంగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా, కయాదు లోహర్(Kayadhu lohar) హీరోయిన్గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ది ప్యారడైజ్(The Paradise) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్టింగ్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై హైప్ ఏర్పడగా, వివిధ కారణాల వల్ల రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌లో రిలీజైన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సినిమాపై మళ్లీ ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్(Anirudha Ravichander) అందించిన ట్యూన్స్ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి.
ఇదే సమయంలో ఇప్పుడు రెండో సాంగ్‌పై ఇండస్ట్రీలో సాలిడ్ బజ్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ నుంచి నెక్ట్స్ సాంగ్ ను మే 10న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ సాంగ్ ఒక రొమాంటిక్ నెంబర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్‌తో ఇప్పటికే మ్యూజికల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయిన నేపథ్యంలో, ఈ కొత్త పాటతో అనిరుధ్ మరింత మ్యూజికల్ మ్యాజిక్ అందిస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు(Mohan Babu) కీలక పాత్రలో కనిపించనుండగా, పాన్ వరల్డ్ స్థాయిలో ఆగస్టు 27న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ నిర్మాణ విలువలు, బలమైన కథాంశం, నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఇవన్నీ కలిసి ది ప్యారడైజ్ ను ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలబెట్టాయి. రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమాపై మరింత హైప్ పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
