మోడ్రన్ డ్రెస్ లో అల్ట్రా స్టైలిష్ గా రుక్మిణి
సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ రుక్మిణి వసంత్(Rukmini vasanth) ఆ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్, ఫాలోయింగ్ వల్ల అమ్మడు ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుని నటిస్తోంది.

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రుక్మిణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే రుక్మిణి తాజాగా పింక్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో చాలా మోడ్రన్ గా మెరిసింది.
సినిమాల్లో చాలా సింపుల్ గా కనిపించే రుక్మిణి, ఇప్పుడిలాంటి గ్లామరస్ డ్రెస్ లో కనిపించడంతో నెటిజన్లు ఫిదా అయిపోయి, వాటిని నెట్టింట తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.