షాంపైన్ కలర్ డ్రెస్సులో రియా అందాల ఆరబోత
అందాల భామ రియా చక్రవర్తి(Rhea Chakravarthy) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో వీడియో జాకీగా అలరించిన ఈ బ్యూటీ, తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ చూపించింది. రియా తాజా ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అయితే ఆ పోస్ట్‌లో ఆమె ధరించిన డ్రెస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల్లో షాంపైన్ కలర్ టోన్‌లో ఉన్న డ్రెస్, ఆమె బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్గా సెట్ అవగా, ఓ వైపు షోల్డర్ డ్రాప్ అయి ఉండి, పొరలు పొరలుగా ఉన్న ప్లీటింగ్ డిజైన్ ఆమెకు వెస్ట్రన్ లుక్ ఇచ్చింది.
డ్రెస్ మాత్రమే కాదు, ఆమె ధరించిన జ్యువెలరీ కూడా హైలెట్ అని చెప్పాలి. ఇంట్రికేట్ డిజైన్ నగలతో రియా మరింత కలర్ఫుల్గా కనిపించగా, ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.