Tollywood: బ్లాక్ బస్టర్ లు.. పరాజయాలు.. వివాదాలతో సాగిన టాలీవుడ్ 2024

2024లో ఎన్నో తెలుగు సినిమాలు(Telugu Movies) విడుదల అయ్యాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ లు కూడా అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి కూడా కనీసం కలెక్షన్లు కూడా అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సాధించాయి. విడుదలకి ముందు వరకు బాగా క్రేజ్ ఉంది కూడా విడుదల తర్వాత మాత్రం డిజాస్టర్‌గా నిలిచిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. అలాంటి సినిమాలు ఏంటో చూద్దాం. ఈ ఏడాది దాదాపు 280 సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో 250 డైరెక్ట్ తెలుగు సినిమాలు కాగా, 30 తెలుగులో డబ్ చేసిన చిత్రాలు. మేము ప్రత్యేకంగా విజయం సాధించిన చిత్రాల గురించి, అపజయం పాలైన మూవీస్ గురించి చర్చించే ముందు 2024 సంవత్సరంలో సినీ పరిశ్రమలో జరిగిన గుడ్ ఆర్ బాడ్ విషయాల గురించి కూడా సింహావలోకనం చేసుకుందాం. ఇది తెలుగు సినిమాకి తగ్గ సంవత్సరం. కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు దుమ్ము రేపినప్పటికీ, ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఈ డిసెంబరు ఆరంభంలో రాజమౌళి.. తరువాత అల్లు అర్జున్ సుకుమార్ ‘పుష్ప 2 – ది రూల్’ యొక్క భారీ విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆశించదగిన స్థితిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. లాక్‌డౌన్‌ల సమయంలో ఓటీటీ వివిధ భాషలలో సిరీస్‌లు మరియు చిత్రాలను చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులకు మరింత పెంచడంతో వెబ్ సిరీస్‌ల మేకింగ్ కూడా పెరిగింది. పాపులర్ సినిమా నటినటులు కూడా ఆ వైపు ఆకర్షితులయ్యారు. పాన్ ఇండియన్ సినిమా అంటూ ప్రతిష్టాత్మకమైన తెలుగు సినిమా జాతీయ బాక్సాఫీస్ వద్ద నిలబడిరదా లేదా ఈ ఏడాది సమీక్షలో చూద్దాం..
2024లో టాప్ 10 చిత్రాలు ఇవే
ఇక ఈ ఏడాదిలో చిన్న పెద్ద బడ్జెట్ చిత్రాలు 250 వరకు విడుదల అయ్యాయి వాటిలో టాప్ టెన్ చిత్రాలలో కలెక్షన్స్ పరంగా పుష్ప 2 ది రూల్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. విడుదల అయిన 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, వందేళ్ళ సినీ చరిత్రలో హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ దిరూల్ ఆ ఘనతను దక్కించుకుంది. భవిష్యత్‌లో పుష్ప-2 ది రూల్ లాంగ్ రన్‌లో మరిన్ని సరికొత్త రికార్డులు ఐకాన్ స్టార్ సొంతం చేసుకోబోతున్నాడని అంటున్నాయి ఇండియన్ ట్రేడ్ వర్గాలు.
ఇక రెండవ స్థానంలో ప్రభాస్ కల్కి 2898 ఎడి పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం లలో విడుదల అయ్యింది. ఇది హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి భాగం. 2898 ఏడీలో అపోకలిప్టిక్ అనంతర ప్రపంచ నేపథ్యంలో సెట్ చేయబడిన సినిమా. నిర్మాణ బడ్జెటులో అత్యంత ఖరీదైన భారతీయ సినిమా ఇది. అయితే ఇప్పటివరకు 1200 కోట్ల రూపాయలు వసూల్ చేసి 2024 రెండవ స్తానంలో వుంది. ఇక మూడవ స్తానం లో జూనియర్ యన్టిఆర్ నటించిన కొరటాల చిత్రం దేవర పార్ట్ 1, బడ్జెట్ పరంగా జూనియర్ యన్టిఆర్ సోలో హీరోగా నటించిన చిత్రాలలో ఇదే హైయెస్ట్ బడ్జెట్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద షుమారు 522 కోట్ల రూపాయలను రాబట్టింది.
సోసియో ఫ్యాంటసి మూవీ హనుమాన్ ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. సినిమా రంగానికి కొత్త హీరో అయినా తేజకు పేరు తెచ్చిన చిత్రం ఇది అన్ని భాషల్లో ఈ చిత్రం 350 కోట్ల రూపాయలవరకు వసూలు చేసి నాలుగవ స్తానంలో నిలబడిరది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూర్ కారం సంక్రాంతి కానుకగా కేవలం ఓకే తెలుగు భాషలో విడుదల అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 172 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రం అయిదవ స్తానంలో నిలబడిరది. ఇక ఆరవ స్తానంలో నిలబడిన టిల్లు స్క్వేర్ సిద్ధూ జొన్నల గడ్డ, హీరో గా సితార బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం కనివిని ఎరుగని విధంగా కలెక్షన్స్ కుమ్మరించింది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం లాభాల పంట పండిరచింది షుమారు 135 కోట్ల రూపాయలను సాధించింది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ కూడా లక్ కలిసి వచ్చింది ఈ సినిమా రివ్యూ పరంగా మంచి రేట్స్ వచ్చాయి కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా నమోదు అయ్యింది . ఈ సినిమా సితార ఎంటర్తిన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం లాభాల పంట పండిరచింది షుమారు 107 కోట్ల రూపాయలను సాధించి ఏడవ స్తానం లో నిలబడిరది. ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీచిత్రాన్ని నిర్మించిన డి వి వి ఎంటర్తిన్మెంట్స్ బ్యానర్ లో నాని హీరోగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించిన సరిపోదా శనివారం నటనలో నాని కి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరి 2024 లో ఎనిమిదవ స్థానం లో నిలబడిరది.
కిరణ్ అబ్బవరం ‘క’ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. స్మాల్ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాత కు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. షుమారు 54 కోట్ల వరకు కలెక్టు చేసి తొమ్మిదవ స్తానం లో నిలబడిరది.
ఇక పదవ స్థానంలో నిలబడిన చిత్రం నా సామి రంగ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం 37.5 కోట్లు వసూల్ చేసింది.
నెలలవారీగా చిత్రాల వివరాలు
ఇప్పుడు టాలీవుడ్ చిత్రాల నెలవారిగా విడుదలలు జయాపజయాలను పరిశీలిద్దాం:
జనవరి: ఈ నెలలో చిన్న పెద్ద 20 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. ముఖ్యంగా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్స్ చిత్రాలు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ ఏడాది కూడా నాగార్జున ‘నా సామి రంగ’ వెంకటేష్ ‘సైంధవ్’ మహేష్ బాబు ‘గుంటూర్ కారం’ విడుదల అయ్యింది. అయితే గ్రాఫిక్స్ హైలెట్ గా సోసియో ఫ్యాంట సి చిత్రం ‘హను- మాన్’ కూడా పండుగకు విడుదల అయ్యింది. ఈ నెలలో కేవలం మూడు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి మిగతా 17 చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
ఫిబ్రవరి: ఈ నెలలో చిన్న పెద్ద 21 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. వీటిలో వూరి పేరు భైరవ కోన, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, భామ కలాపం, యవరాజ్ టాక్ వచ్చినా.. మిగతా బూట్ కట్ బాలరాజు, రవి తేజ ఈగల్, ధీర, యాత్ర 2, హ్యాపీ ఎండిరగ్, శేష్ మహల్ ఇలా 17 చిత్రాల వరకు పరాజయం పాలయ్యాయి.
మార్చ్: మార్చ్ నెలలో భారీ సంఖ్యలో షుమారు 32 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. మార్చ్ నెలాఖరులో విడుదల అయిన టిల్లు స్వ్కేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలంగాణా సాయుధ పోరాటంపై పిరియాడికల్ మూవీగా వచ్చిన ‘రాజాకార్’ మేకింగ్ పరంగా మంచి పేరు వచ్చింది. రెవిన్యూ కూడా ఓకే. ఇక గోపి చంద్ హీరోగా నటించిన భీమా, వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ విశ్వక్సేన్ ‘గామీ’ విడుదలకు ముందు వున్నా బజ్ రిలీజ్ అయిన తరువాత లేకుండా పోయింది. ఈ నెలలో 32 చిత్రాలకు గాను ఒకే ఒక్క టిల్లు స్వ్కేర్ తప్పించి ఏ చిత్రం థియేటర్ లలో నిలబడలేకపోయాయి.
ఏప్రిల్: సమ్మర్ స్టార్టింగ్ లో విడుదలైన ది మోస్ట్ వాంటెడ్ మూవీ ‘ది ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవర కొండ, మృణాల్ టాకూర్ హీరో హీరోయిన్ లుగా నటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ మూవీ ప్రేక్షకుడిని నిరాశ పరిచింది. అంజలి నటించిన హర్రర్ మూవీ గీతాంజలి మళ్లి వచ్చింది మాత్రం యవరేజ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు మంచి వ్యాపారం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చారు. ఇక ఈ నెలలో విడుదలైన 16 చిత్రాలలో 15 చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
మే: మే మాసం అంటేనే సమ్మర్ స్పెషల్ బిగ్ స్టార్స్ నటించే చిత్రాలు విడుదల అవుతుంటాయి కాని మినిమం బడ్జెట్‌తో తీసిన మిడిల్ రేంజ్ హీరోల చిత్రాలు విడుదల అయ్యాయి వాటిలో అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు,’ వర లక్ష్మి ‘శబరి,’ సుహాస్ ‘ప్రసన్న వదనం,’ సత్యదేవ్ ‘కృష్ణమ్మా,’ నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ కార్తికేయ ‘భజే వాయు వేగం’ ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశ’ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ టోటల్ గా మే నెలలో 23 చిత్రాల వరకు విడుదల అయ్యాయి. వీటిలో గం గం గణేష్ సక్సెస్ అయ్యింది. మిగతా 22 చిత్రాలు యావరేజ్ ప్లాప్ లు చవి చూసాయి.
జూన్: ఈ నెలలో చిన్న పెద్ద 24 చిత్రాలవరకు విడుదల అయ్యాయి. అయితే ఈ నెల ఆఖరులో విడుదలైన ‘కల్కి 2898 %Aణ%’ సెన్సేషన్ క్రియేట్ చేసింది పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం లలో విడుదల అయ్యింది. మేకింగ్ పరంగా రెవిన్యూ పరంగా రికార్డులు సాధించింది. విడుదలైన 24 చిత్రాలలో 23 చిత్రాలు థియేటర్ లో నిలబడలేక చతికిలపడ్డాయి.
జూలై: ఈ నెల లో 11 సినిమాలు విడుదలైనా వాటిలో గుర్తించబడే డార్లింగ్, రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ,’ రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, సారంగదరియ, ఇలా ఏ ఒక్క చిత్రం జూలై నెలలో ఆడలేదు.
ఆగష్టు: ఆగష్టు నెలలో అత్యధికంగా 32 చిత్రాలు విడుదల అయ్యాయి. అల్లు శిరీష్ ‘బడ్డి,’ తిరగబడిర సామీ,విరాజి, భవనం, సింభ, రామ్ పూరిల డబల్ ఇస్మర్ట్, రవి తేజ మిస్టర్ భచ్చన్, వంటి చిత్రాలు విడుదలకు మంచి బజ్ వచ్చినా విడుదల తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 32 చిత్రాలలో నాని హీరోగా ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా నటించిన సరిపోదా శనివారం నటనలో నాని కి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరి 2024 లో ఎనిమిదవ స్తానం లో నిలబడిరది. నార్నే నితిన్ నటించిన ‘ఆయ్’ చిన్న చిత్రాలలో పెద్ద విజయం సాధించింది. కమిటీ కుర్రోళ్ళు హిట్ చిత్రంగా నిలిచింది. మిగతా29 చిత్రాలు పరాజయం పాలుఅయ్యాయి.
సెప్టెంబర్: సెప్టెంబర్ నెలలో 14 చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే వీటిలో సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన జూనియర్ యన్టిర్ నటించిన కొరటాల చిత్రం దేవర పార్ట్ 1, బడ్జెట్ పరంగా జూనియర్ యన్టిర్ సోలో హీరోగా నటించిన చిత్రాలలో ఇదే హైయెస్ట్ బడ్జెట్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద షుమారు 522 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ నెలలో కేవలం ఈ ఒకే ఒక చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది మిగతా 13 చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి.
అక్టోబర్: ఈ నెలలో 25 చిత్రాలు విడుదల అయినా సక్సెస్ అయిన చిత్రాలు శ్రీ విష్ణు ‘స్వాగ్’ అతని కెరిర్ లో నటనా పరంగా మంచి పేరు వచ్చింది సినిమా కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అనన్య నాగళ్ల, నోయెల్ నటించిన పోట్టేల్ సినిమా యవరీజ్ గా నిలబడిరది. ఇక కిరణ్ అబ్బవరం హీరో గా ‘క’ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. స్మాల్ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాత కు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. షుమారు 54 కోట్ల వరకు కలెక్టు చేసి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలబడిరది. గోపి చంద్ ‘విశ్వం’ సుదీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ పరాజయం పాలైనాయి. మొత్తానికి ఈ నెల పరవాలేదు.
నవంబర్: ఈ నెలలో విడుదలైన 18 సినిమాలలో ఏ ఒక్క చిత్రం నిలబడలేదు. నిఖిల్ హీరోగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. వరుణ్ సందేశ్ ‘మట్ట్కా’ అశోక్ గళ్ళ ‘దేవకీ నందన వాసుదేవ ‘ విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సత్య దేవ్ ‘జేబ్రా’ చిత్రాలపై విడుదలకు ముందు మంచి అంచనాలు వున్నా విడుదల తరువాత ఆశించిన పలితం దక్కలేదు. వీటిలో రాజేష్ వర్రే నటించి నిర్మించిన ‘జితేందర్ రెడ్డి’ పరవాలేదు అనిపించింది. మిగతా చిత్రాలన్నీ పరాజయం పాలైయ్యాయి.
డిసెంబర్: ఈ నెలలో కేవలం 11 చిత్రాలు మాత్రమే విడుదల అయ్యాయి వీటిలో అల్లు అర్జున్ సుకుమర్ల మైత్రి మూవీ మేకర్స్ చిత్రం ది వన్ అండ్ ఓన్లీ ‘పుష్ప 2 ది రూల్’ విడుదల అయిన 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయాలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, వందేళ్ళ సినీ చరిత్రలో హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ దిరూల్ ఆ ఘనతను దక్కించుకుంది.ఇటివల విడుదలైన ఫియర్, అల్లరి నరేష్ బచ్చల మల్లి, వెన్నెల కిషోర్ శ్రీ కాకుళం శేర్లోక్ హొమెస్, పరవాలేదు అనిపించినా రెవిన్యూ పరంగా వెనకబడి వున్నాయి.
ఆకట్టుకోలేకపోయిన డబ్బింగ్ చిత్రాలు
తమిళ్ నుండి తెలుగు లోకి డబ్బింగ్ అయిన చిత్రాల హావా ఈసారి కూడా నడిచింది. ఈ ఏడాది భారతీయుడు 2, తంగలాన్, గొట్, వేట్టియన్, కంగువ,ఏఆర్యం, వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యాయి. మనకు అర్ధం కాకపోయినా తమిళ్ లో పెట్టిన టైటిల్స్ తోనే ఇక్కడ కూడా విడుదల చేయడం విడ్డురం. తమిళ్ అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం పోటి పడేవారు. అది ఒకప్పుడు మరి ఇప్పుడో తెలుగు సినిమా కోసం హిందీ, తమిళ్, కన్నడ ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో యూనివర్సల్ కథానాయకుడు కమల్ హసన్ నటించిన ‘భారతీయుడు 2’ జూలై లో విడుదల అయ్యింది. ది గ్రేట్ డైరెక్టర్ యన్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
‘తంగలాన్’, ఆగస్టు 15న విడుదలయిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించబడిరది. ఈ చిత్రం తెలుగు లోనే కాదు ఏ భాషలో కూడా రన్ కాలేదు. ‘ది గోట్’ సెప్టెంబర్ 15న విడుదల అయిన సినిమా. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటించిన ది గోట్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై వెనువెంటనే అక్టోబర్ 3న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ‘ఎఆర్‌ఎం’ సెప్టెంబర్ 12న విడుదలైన మలయాళ చిత్రం తెలుగులో కూడా విడుదల అయ్యింది. టోవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక్క షోతో కానరాకుండా పోయింది.
‘కంగువా’ నవంబర్ 14న తెలుగులో విడుదలైన పీరియాడిక్ సినిమా. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. కనీసం కలెక్షన్లు కూడా అందుకోలేక ఫ్లాప్ అయిన చిత్రంగా నిలబడింది.
‘వేట్టయన్ – ది హంటర్’ అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.అమరన్, దేమోంటి కాలనీ 2, మహా రాజ చిత్రాలు యావరేజ్ చిత్రాలుగా నిలబడ్డాయి. హిందీ నుండి తెలుగు లోకి డబ్బింగ్ అయిన చిత్రాలు హృతిక్ రోషన్ ‘ఫైటర్’ అజయ్ దేవగన్ ‘మైదాన్’ ‘భూల్ బులయ్య3’ ఈ మూడు చిత్రాలు తెలుగులో డిజాస్తార్డ్ చిత్రాలుగా నిలిచాయి.