Ram Charan: ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుందామా వద్దా…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ లాంటిది. రామ్ చరణ్ సోలోగా ఏడేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా తర్వాత ఈ సినిమానే మళ్లీ. దీనితో మెగా అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఈ సినిమా నిర్మాతలు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. వరల్డ్ వైడ్ గా సినిమాకు బజ్ భారీగా క్రియేట్ చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకే అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది మూవీ యూనిట్.
అయితే ఈ సినిమా ప్రమోషన్ కు ఎవరి సపోర్ట్ తీసుకుంటారు అనే దాని పైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) సపోర్ట్ తీసుకోవాలా వద్దా అనే దానిపై మెగా ఫ్యామిలీ మల్లగుల్లాలు పడుతుంది. దేవర సినిమా రిలీజ్ టైం లో ఎన్టీఆర్ ను అలాగే కొరటాల శివను టార్గెట్ గా చేసుకుని మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇప్పుడు కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ (Game changer) సినిమా విషయంలో పగ తీర్చుకునే అవకాశం క్లియర్ గా కనబడుతోంది. ఈ సినిమా వసూళ్లు అలాగే సినిమా రిజల్ట్ కూడా రామ్ చరణ్ కు చాలా ఇంపార్టెంట్.
అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకోవాలి అనే ఒపీనియన్ వినపడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇండియా వైడ్ గా తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అమెరికాలో ఫ్రీ రిలీజ్ మార్కెట్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. అయితే మెగా ఫ్యామిలీ లోనే తమ ఇబ్బంది పెడుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయింది. నార్త్ ఇండియాలో ఆ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దేవర సినిమా కంటే ముందు పుష్ప సినిమాను బీట్ చేయాలి అనే టార్గెట్ రామ్ చరణ్ లో ఎక్కువగా కనబడుతోంది.
అందుకే ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుంటే మంచిదని అలా చేస్తే కచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ ప్రభావం ఉండదు అనేది మెగా ఫ్యామిలీ ఒపీనియన్ గా కనబడుతోంది. అయితే ఎన్టీఆర్ సపోర్ట్ చేసినంత మాత్రాన ఆయన ఫ్యాన్స్… గేమ్ చేంజర్ సినిమాకు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం పగతో రగిలిపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కచ్చితంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. కొరటాల శివ పై కోపం ఉంటే వేరే సినిమాలో చూపించుకోవాలి గాని ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కు మంచి స్నేహం ఉన్నా సరే దేవర సినిమాను నెగిటివ్ చేశారనే కోపం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎక్కువగా కనబడుతోంది. ఇటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నారు. మరి ఏం జరగబోతుంది రాబోయే యాంటీ ఫ్యాన్స్ వార్ ఏ విధంగా రాంచరణ్ ఎదుర్కొంటాడో చూడాలి.