Ram Charan: ఎన్టీఆర్, బన్నీకి లేని సమస్య చరణ్ కే..!

ఏది ఏమైనా భారీ బడ్జెట్ సినిమాలకు ప్రస్తుతం వాతావరణం దినదిన గండం అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan)… గేమ్ చేంజర్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు రెండు సినిమాల నుంచి ఈ సినిమాకు సమస్య ఉందంటున్నాయి బాక్సాఫీస్ వర్గాలు. భారీ బడ్జెట్ తో దాదాపు మూడేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులలో రికార్డుల పరంగా చాలా అంచనాలే ఉన్నాయి. కచ్చితంగా భారీ రికార్డులను బ్రేక్ చేస్తామని… మెగా అభిమానులు ధీమాగా కనపడుతున్నారు.
కానీ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ సినిమా, వెంకటేష్ (Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ఇప్పుడు కాస్త ఈ సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. ఆ రెండు సినిమాలకు కూడా భారీగా థియేటర్లను కేటాయించాల్సి ఉండటంతో రామ్ చరణ్ సినిమాకు థియేటర్లు దక్కడం కష్టంగానే మారింది. రెండు మూడు రోజులు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా లాంగ్ రన్ లో మాత్రం కచ్చితంగా ఇబ్బందులు తప్పవు అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలకు వసూళ్లు రావాలి అంటే కచ్చితంగా సినిమాకు ఎక్కువ థియేటర్లు ఉండాలి.
దేవర సినిమా విషయంలో అలాగే పుష్ప (Pushpa 2) పార్ట్ 2 విషయంలో నిర్మాతలు ఇదే ఫాలో అయ్యారు. అందుకే ఆ రెండు సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ గా కనబడే పరిస్థితి ఉంది. అటు తమిళంలో కూడా ఆరు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండటంతో అక్కడ కూడా దెబ్బ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ కోసం అజిత్ తన సినిమాను రిలీజ్ వాయిదా వేసుకున్నారట మరి. లేదంటే మాత్రం కచ్చితంగా తమిళంలో థియేటర్లో దక్కడం కూడా కష్టం అయ్యేది.