Kayadhu Lohar: గేమ్ ఛేంజర్ పై కయాదు ఆశలు
ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan) తో చేసిన డ్రాగన్(dragon) సినిమాలో తన యాక్టింగ్ తో ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్(kayadhu lohar) కెరీర్ ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. ఆ సినిమాతో ఆమెకు విపరీతమైన గుర్తింపు లభించగా, వరుసగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు వెల్లువెత్తాయి. రీసెంట్ గా ఆమె విశ్వక్ సేన్(vishwak sen) సరసన నటించిన ఫంకీ(funky) ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా, కాయదు లోహర్ పెర్ఫార్మెన్స్ మాత్రం స్పెషల్ గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసించారు. సినిమాలో మంచి విషయం ఏదైనా ఉంటే అది కాయదునే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆమె నాని(nani) హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్(the paradise) షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తన తెలుగు కెరీర్‌కు ఇది గేమ్‌చేంజర్ అవుతుందనే నమ్మకంతో కాయదు ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు ఆమె ఖాతాలో పడే అవకాశముంది. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్‌ను కూడా పెంచి సుమారు రూ.1 కోటి డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే నిర్మాతలు ఆమె రాబోయే సినిమాల ఫలితాలను గమనించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.
ఇక ఇతర భాషల్లో కూడా కాయదు వరుస సినిమాలతో బిజీగా ఉంది. మలయాళంలో పల్లిచట్టాంబి(pallichattambi), ఐయామ్ గేమ్(I’m game), తారమ్(thaaram) సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తమిళంలో ఇదయమ్ మురళి(idhayam murali), ఇమ్మోర్టల్(immortal) తో పాటూ శింబు49(simbhu49) సినిమాలో కూడా ఆమెకు కీలక పాత్ర దక్కింది. ఇలా మూడు భాషల్లోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కయాదు లోహర్, త్వరలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సెటిలవుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి