ఎండ ప్రభావం వల్ల చర్మంపై టాన్ ఏర్పడటం సాధారణ సమస్య. సరైన సంరక్షణతో పాటు సహజ పదార్థాలను ఉపయోగించడం ద్వారా టాన్‌ను క్రమంగా తగ్గించుకోవచ్చు.
నిమ్మరసం, తేనె మిశ్రమం చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
పెరుగు , శెనగ పిండి కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రపడి కాంతివంతంగా మారుతుంది. ఇది టాన్ తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
అలోవెరా జెల్ చర్మానికి తేమను అందిస్తూ ఎండ వల్ల కలిగిన నలుపును తగ్గిస్తుంది. ప్రతిరోజూ రాత్రి వేళ రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
టమాటా , ఉల్లగడ్డ రసం సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. దీన్ని చర్మంపై అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగితే టాన్ తగ్గే అవకాశం ఉంటుంది.
సహజ పద్ధతులతో పాటు సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం ,ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం మీ చర్మ సంరక్షణకు ముఖ్యమైన సూచనలు.
ఇలా చేయడం వల్ల ఈ ఎండాకాలం కెమికల్స్ తో నిండిన క్రీమ్స్ బదులు సహజమైన పదార్థాలతో ఇంటి వద్దనే సులభంగా టాన్ తొలగించుకోవచ్చు.
ముల్తాని మట్టి: గులాబీ నీటితో కలిపి అప్లై చేస్తే టాన్ తగ్గి చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
దోసకాయ రసం: చర్మాన్ని చల్లబరుస్తూ నలుపు తగ్గిస్తుంది. రాసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేయాలి.
శుక్రవారం ఏ రాశి వారు ఎటువంటి పూజ చేయాలి