Sukumar: అలెర్ట్ అయిన సుకుమార్, అమెరికా కామెంట్స్ వెనుక రీజన్ అదే…?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సరే సుకుమార్ డైరెక్షన్ అంటే ఫ్యాన్స్ ఫిదా అవుతారు. సినిమా ఎలా తీయాలో మాస్ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకోవాలో పక్కగా స్కెచ్ తీసుకుని లెక్కలు మాస్టారు సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. రంగస్థలం అలాగే పుష్ప 2 (Pushpa 2) రెండు పార్టులతో తానేంటి అనేది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సుకుమార్ ఒక తెలియని ఒత్తిడిలో కనపడుతున్నాడు.
రెండు ఫ్యామిలీల మధ్య సుకుమార్ నలిగిపోతున్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. రీసెంట్ గా గేమ్ చేంజర్… సినిమా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్ళిన సుకుమార్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని కామెంట్స్ చేశాడు. గతంలో తాను ఏ హీరోతో అయినా సినిమా చేస్తే అతనితో రెండు మూడేళ్లు స్నేహం ఉంటుందని ఆ తర్వాత అతన్ని పక్కన పెడతానని… కానీ రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ ను మాత్రం పక్కన పెట్టలేదని తనకు తమ్ముడు లాంటి వాడంటూ కామెంట్ చేశాడు.
వాస్తవానికి సుకుమార్ కు ఒకరకంగా లైఫ్ ఇచ్చింది అల్లు అర్జున్ (Allu Arjun) అని చెప్తూ ఉంటారు అతనితో ఏకంగా నాలుగు సినిమాలు చేశాడు సుకుమార్ ఇక వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి స్నేహం కూడా ఉంది అలాంటిది ఇప్పుడు సుకుమార్ తనకు అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ (Ramcharan) ముఖ్యం అని చెప్పడం వెనక కారణం ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయితే అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ కోపంగా ఉండటంతో తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఈ విధంగా కామెంట్స్ చేసి ఉండొచ్చని టాక్.
అలాగే తాను రాంచరణ్ తో సినిమా చేస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడని… ఇక తనకు ఇబ్బందికర పరిణామాలు సంధ్యా థియేటర్ ఘటన విషయంలో ఎదురు కాకుండా ఉండేందుకే మెగా ఫ్యామిలీకి మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్లి ఉండవచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎప్పుడు ఇటువంటి వివాదాలు లేని సుకుమార్ మొదటిసారి తెలియని ఒత్తిడిలో కనపడటంతో అభిమానులు కూడా కాస్త షాక్ లోనే ఉన్నారు.