Dil Raju: మీరు కలిసుంటేనే ఫ్యూచర్, అల్లు అరవింద్ కు తేల్చేసిన దిల్ రాజు

ఈ రోజుల్లో సినిమా (Cinema) పరిశ్రమలో నాలుగు సినిమాలు చేసుకుంటూ నాలుగు రూపాయలు వెనకేసుకోవాలి అంటే పెద్ద పెద్ద కుటుంబాలు కలిసి ఉండాలి. అనవసరమైన రాద్ధాంతానికి వెళ్లకూడదు అనే ఒపీనియన్ చాలా సందర్భాల్లో వినపడింది. అందుకే స్టార్ హీరోలు అందరూ కలిసే ఉంటున్నారు ఈ మధ్య. బావా అనే పదం బోనస్. చాలా సందర్భాల్లో అది జనాలు స్వయంగా చూసారు. పెద్ద కుటుంబాలు యుద్ధానికి వెళ్తే పరిస్థితి దిగాజారడమే గాని లాభాలు ఏమి ఉండవు. అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ (Tollywood) అయినా ఏ ఫుడ్ అయినా సరే.
ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు మధ్య వివాదం రేగింది. మెగా, అల్లు కుటుంబాలు ఒకప్పుడు పాలు నీళ్ళలా కలిసిపోయి సినిమా పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉంది. అల్లు అర్జున్.. మెగా ఇమేజ్ నుంచి బయటకు రావాలి అనుకోవడం.. ఇక తమకు అల్లు అర్జున్ ఎదురు వెళ్లడాన్ని మెగా ఫ్యామిలీ ఇష్టపడకపోవడం అన్నీ కూడా తెలుగు సినిమా పరిశ్రమంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వాతావరణం మార్చాయి. సినిమా పరిశ్రమంలో గతంలో ఎప్పుడు ఈ తరహా వాతావరణం కనబడలేదు.
అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమంలో ఉన్న ప్రముఖులు మెగా ఫ్యామిలీని అల్లు ఫ్యామిలిని కోరుతున్నది ఒక్కటే. ఇప్పుడు తెలంగాణ (Telangana) ప్రభుత్వంతో సయోధ్యకు వెళ్లాలి. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా సినిమా పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే విభేదాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సినిమా పరిశ్రమలో విభేదాలు ఈ స్థాయిలో ఉంటే అభిమానుల్లో కూడా చులకన అయ్యే అవకాశం ఉందని ఆందోళన కూడా సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవిందతో దిల్ రాజు చర్చలు కూడా జరిపారు.
ప్రభుత్వాలతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేసే సమయంలో సినిమా పరిశ్రమలో చీలికలు ఉంటే కచ్చితంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని, రెండు వర్గాలుగా సినిమా పరిశ్రమ ఉండటం కూడా భారీ బడ్జెట్ సినిమాలకు మంచిది కాదని, భారీ బడ్జెట్ సినిమాలకు మంచి వసూళ్లు రావాలి అంటే కచ్చితంగా అభిమానులు కలిసి ఉండాలని, లేనిపోని సమస్యలు సృష్టించుకుంటే రాబోయే సినిమాలు కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, పుష్పా 2 సినిమా వసూళ్లు కొన్ని ప్రాంతాల్లో తగ్గటానికి ఇదే కారణమనే అభిప్రాయాన్ని దిల్ రాజు వ్యక్తం చేశారు.
ఇక ముఖ్యమంత్రితో దిల్ రాజు భేటీకు ముందే అల్లు అరవింద్ తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా సూచించినట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతో విభేదాల కారణంగానే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చిందనే విషయాన్ని దిల్ రాజు గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఫ్యామిలీ అంతా ఏకతాటి మీద ఉండి ఉంటే కచ్చితంగా పరిస్థితి మరోలా ఉండేదని, అల్లు అర్జున్ (Allu Arjun) అలా ప్రవర్తించి ఉండేవారు కాదనే అభిప్రాయాన్ని కూడా దిల్ రాజు నిర్మొహమాటంగా చెప్పారట. రెండు కుటుంబాలు పెద్దవే కాబట్టి అర్థం చేసుకొని ముందుకు వెళితే భవిష్యత్తులో వచ్చే ఫలితాలు బాగుంటాయని, తాను చేసేది తాను చేస్తానని… ఇక మిగిలింది మీ చేతిలోనే ఉందంటూ దిల్ రాజు.. అల్లు అరవింద్ వద్ద తేల్చి చెప్పారట.