Dil Raju: గాయపడ్డ సింహం రిలీజ్ అప్పుడే.. కానీ కండిషన్స్ అప్లై..
టాలీవుడ్లో వినూత్న కథనాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ దాస్యం(Tharun Bhascker) హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం (Gayapadda Simham) సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. కశ్యప్ శ్రీనివాస్(Kashyap Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా(Faria Abdhulla), మానస చౌదరి(manasa chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సిటివ్ కథలతో గుర్తింపు పొందిన పవన్ సాధినేని(pavan Sadhineni) ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) విడుదల చేయనున్నట్టు ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో జరిగిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మే 1న గాయపడిన సింహం విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా, అదే సమయంలో ఏప్రిల్ 30న రామ్ చరణ్(ram charan) నటిస్తున్న పెద్ది(peddi) భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన దిల్ రాజు, పెద్ది లాంటి భారీ సినిమా రిలీజవుతున్నప్పుడు మే 1కి తాము థియేటర్లు ఇవ్వడం సాధ్యం కాదని ముందుగానే మేకర్స్‌కు చెప్పినట్లు వెల్లడించారు. కండిషన్స్ అప్లై అనే కండిషన్ తోనే ఈ రిలీజ్ డేట్‌ను ప్రకటించారని దిల్ రాజు స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే రిలీజ్ డేట్ మారే అవకాశముందని కూడా దిల్ రాజు సంకేతం ఇచ్చారు. ప్రమోషనల్ కార్యకలాపాల కోసం ముందుగా ఒక తేదీని ప్రకటించడం అవసరమని, కానీ థియేటర్ పరిస్థితులు అనుకూలించకపోతే వారం రోజులు వాయిదా పడే అవకాశముందని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో, అధికారికంగా చెప్పకపోయినా సినిమా వాయిదా దిశగా వెళ్లే అవకాశం ఉందనే సంకేతాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
