Revanth Reddy: తగ్గేదేలే, నో మోర్ బెనిఫిట్ షోస్

తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయం మారే ఛాన్స్ లేదని సీఎం స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో తెలంగాణ (Tollywood)లో బెనిఫిట్ షోలు లేవని క్లారిటీ ఇచ్చేసారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ సినీ పెద్దలకు స్పష్టంగా చెప్పారు. బౌన్సర్ల విషయంలో ఇక నుంచి సీరియస్ గా ఉంటానన్న సీఎం.. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలపై ఉందన్నారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని డ్రగ్స్ ప్రచారం,మహిళల భద్రతా ప్రచారం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టెంపుల్ టూరిజం మరియు ఎకో టూరిజంను ప్రోత్సహించాలని పెట్టుబడికి పరిశ్రమలు కూడా సహకరించాలి సినీ పెద్దలను కోరారు రేవంత్. టాలీవుడ్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు రేవంత్. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మేం ముందుంటామని స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామని తెలిపారు.
ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని సీఎం సూచించారు. ఇక ఈ సమావేశంలో సినిమా పెద్దలు పలు సమస్యలను రేవంత్ వద్ద ప్రస్తావించారు. సమావేశం అనంతరం మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్… ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినమన్న ఆయన హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి.. ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.