Aha OTT: ఈసారి సంక్రాంతి సందడి మొత్తం ఈ ఓటీటీ టాక్ షో దే..

సంక్రాంతి (Sankranti) అంటేనే పెద్ద సినిమాల సందడి. ప్రతి ఏడాది ఈ పండుగ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలతో పోటీ ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే 2025 సంక్రాంతి (Sankranthi movies) పోటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా కనిపిస్తోంది. ఈసారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రెండు రోజుల గ్యాప్‌లో విడుదల కానుండటంతో సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జనవరి 10న రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన “గేమ్ ఛేంజర్” (Game Changer) మొదట విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి.పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో చిత్రం కావడంతో ఈ మూవీ కోసం అతని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ చరణ్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుంది అని వారు భావిస్తున్నారు.
ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ (Bala Krishna) , బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన డాకు మహారాజ్ (Daku Maharaj) చిత్రంతో బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఓ డిఫరెంట్ షేడ్స్ తో బాలకృష్ణ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా అలరించబోతున్నారని టాక్. పండగ సీజన్ బాలకృష్ణ కి బాగా కలిసి వస్తుంది అని భావించే అతని అభిమానులు సంక్రాంతి సంబరాలు బాలయ్య సినిమాతో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక జనవరి 14న వెంకటేష్ (Venkatesh) , అనిల్ రావిపూడి (Anil Ravipudi ) కాంబోలో విడుదలవుతున్న సంక్రాంతికి వస్తున్నాం (Sankranthikii Vastunam ) సినిమా ఉండనే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ అయిన వెంకీ మామ తనదైన స్టైల్ కామెడీతో ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతికి కరెక్ట్ గా సెట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తుంది అని చిత్ర బృందం కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది.
మూడు సినిమాలూ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచి, ప్రేక్షకుల అటెన్షన్ గెలుచుకుంటున్నాయి. ప్రత్యేకంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా “అన్‌స్టాపబుల్” (Unstoppable) టాక్ షోలో ఈ మూడు సినిమాల టీంలు పాల్గొనడం ప్రధాన హైలైట్‌గా మారింది. ఇప్పటికే వెంకటేష్ తన సినిమా ప్రచారంలో భాగంగా ఈ షోలో పాల్గొని, చిత్రానికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేశారు. అదే విధంగా రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” టీమ్ కూడా డిసెంబర్ 31న షో షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.
బాలకృష్ణ “డాకు మహారాజ్” కోసం ప్రత్యేక ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. హీరోయిన్స్, దర్శకుడు బాబీతో కలిసి చిత్రబృందం అన్‌స్టాపబుల్‌లో సందడి చేయనుంది. గతంలో కూడా బాలకృష్ణ తన సినిమాల ప్రమోషన్‌లో భాగంగా ఈ షోలో ప్రత్యేక ఎపిసోడ్లు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి బజ్‌తో ఈ సంక్రాంతికి విడుదల కానున్న మూడు సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇలా మొత్తానికి సంక్రాంతి సినిమాల ప్రమోషన్ కి కీరాఫ్ అడ్రస్ గా ఆహా ప్లాట్ఫారం ఫిక్స్ అయిపోయింది.