USAID :యూఎస్‌ఎయిడ్‌లో 9,700 ఉద్యోగాల కోత!

ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఎయిడ్) లో ఏకంగా 9,700 కు పైగా ఉద్యోగాలు(Jobs) తొలగించేందుకు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300 కంటే తక్కువస్థాయికి తేవాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీ (Agency)లో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.