America : అమెరికా -చైనా కయ్యం మనకు లాభమే

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మన దేశానికి మేలు చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10 నుంచి చైనా (China) దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తాజాగా ప్రకటించారు. దీంతో అమెరికా మార్కెట్లో చైనా వస్తువులు ప్రియం కానున్నాయి. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా కంపెనీలు భారత్‌వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అయితే మన దేశానికి ఈ లాభం ఏ మేరకు ఉంటుందనే విషయం మన ఉత్పత్తి సామర్థ్యం, పోటీతత్వాలపై ఆధారపడి ఉంటాయని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియా) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ తెలిపారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మన దేశం నుంచి ఆ దేశానికి ఎలక్ట్రిక్ మెషినరీ (Electric machinery), వాటి విడి భాగాలు, ఆటోమొబైల్ విడి భాగాలు, మొబైల్, ఫార్మా, రసాయనాలు, బట్టలు వస్త్రాల ఎగుమతి పుంజుకునే అవకాశం ఉందని సహాయ్ అంచనా వేశారు.