TikTok : టిక్‌టాక్ కొనుగోలుపై ఆసక్తి లేదు : మస్క్

చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అమెరికా విభాగ స్వాధీన తపై తనకు ఆసక్తి లేదని ఎలాన్ మస్క్(Elon Musk) తెలిపారు. టిక్‌టాక్ సహా చైనా(China) యాప్‌లను భారత్(India) సహా కొన్ని దేశాలు ఇప్పటికే నిషేధించగా, ఇప్పుడు అమెరికాలోనూ టిక్ టాక్‌కు నిషేధం ముప్పు పొంచి ఉంది. దీని నుంచి తప్పించుకునేందుకు టిక్‌టాక్ అమెరికా(America) విభాగంలో నియంత్రిత వాటాను స్థానిక పెట్టుబడిదారుకు విక్రయిచాలనేది సంస్థ ఆలోచన. ఎలాన్ మస్క్‌కు విక్రయించాలని సంస్థ చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ యాప్‌ను స్వాధీనం చేసుకునే యోచనలో తాను లేనని మస్క్ స్పష్టం చేసినట్లు తెలిసింది.